• Neti Charithra

జమ్మూ కాశ్మిర్ లో ఉగ్రవాదుల ఘాతుకం....

#జమ్మూ కాశ్మిర్ లో ఉగ్రవాదుల ఘాతుకం..

శ్రీనగర్‌: నేటి చరిత్ర (ఆగష్టు28) ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి ఉగ్రవాదుల దాడులు మంగళవారం రాత్రి జరిగాయి. పుల్వామా జిల్లా నాగ్‌బరాన్ ప్రాంతంలో సోమవారం అబ్‌ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. వారు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్‌లోని లచీతాప్ బెహక్ అటవీ ప్రాంతంలో ఖదీర్‌, మంజూర్‌ మృతదేహాలు కనిపించాయి. భద్రతా దళాలు మృతదేహాలను స్వాధీనం చేసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. త్రాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రోడ్డుపై వాహనానాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. కశ్మీర్‌లో ఆంక్షలను కొంత సడలించిన నేపథ్యంలో ఈ ఘటనతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. కశ్మీర్‌లోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో మళ్లీ భద్రతను కట్టదిట్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon