• Neti Charithra

జగన్ సమక్షం లో వైసీపీ లో చేరిన టీడీపీ, వైసీపీ కీలక నేతలు!

#జగన్ సమక్షం లో వైసీపీ లో చేరిన టీడీపీ, వైసీపీ కీలక నేతలు!

అమరావతి: నేటి చరిత్ర (అక్టోబర్8) పలు పార్టీలకు చెందిన కీలక నేతలు వైసీపీ అధినేత సీఎం జగన్ ఆద్వర్యం లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌, జనసేన మాజీ నేత ఆకుల సత్యనారాయణ వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ వారిద్దరికీ పార్టీ కండువా కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. జగన్‌ సుపరిపాలనలో భాగమయ్యేందుకే పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికలకు మందు మేనిఫెస్టోను ప్రకటించి.. ఆ తర్వాత దానిని పట్టించుకోవని, కానీ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం మేనిఫెస్టోలో పేర్కొన్న అభివృద్ధి కార్యక్రమాలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆకుల అన్నారు. ఆయన చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకే వైకాపాలో చేరుతున్నట్లు చెప్పారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon