• Neti Charithra

జగన్ పాలన లో ...100 రోజులకు.. 125 తప్పులు .. నాలుగు ఛార్జ్ షీట్లు విడుదల చేసిన మాజీ మంత్రులు!

#జగన్ పాలన లో ...100 రోజులకు.. 125 తప్పులు .. నాలుగు ఛార్జ్ షీట్లు విడుదల చేసిన మాజీ మంత్రులు!

గుంటూరు: నేటి చరిత్ర (సెప్టెంబర్7) వైసీపీ అధికారం లోకి వచ్చి న 100 రోజుల్లో 125 రకాల తప్పులు చేసిందని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, అఖిల ప్రియ, నక్కా ఆనంద్ లు జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీని మర్చిందని ఆరోపించారు. రాష్ట్రము లో ఇసుక కష్టాలు.. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఫై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వైసీపీ వంద రోజుల పాలన లో టీడీపీ శ్రేణుల పై దాడులు, హత్యలు, ఆస్తి నష్టాలు కలిగించారన్నారు. ఉన్న ఉద్యోగాలు రద్దు చేసి వారి స్థానం లో భర్తీ చేస్తూ కొత్త ఉద్యోగాల ఖాతాలో వైసీపీ ప్రకటించుకుంటోందన్నారు. పోలీసులతో పాలన చేసే సంస్కృతికి జగన్ ప్రభుత్వం తెర తీస్తోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాలన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon