• Neti Charithra

జగన్ ప్రభుత్వం .. ముస్లింలకు మోసం.. చేస్తోంది- పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్!

విజయవాడ: నేటి చరిత్ర (జనవరి29)

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముస్లిం లకు మోసం చేస్తున్నాడని ఏపీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మండి పడ్డారు. విజయవాడ లో ఆయన బుధవారం పీసీసీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం ల హక్కులు కాల రాచే .. పౌరసత్వ చట్ట సవరణ కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో తీర్మానించలేదన్నారు. ఓ ఆలోచన అంటూ లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతోందని ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆరోపించారు. ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేసి పాలిస్తున్నారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

తన తో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా తులసిరెడ్డి, మస్తాన్‌వలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ యుద్ధం జరుగుతోందన్నారు. వైకాపా, తెదేపా, జనసేన పార్టీలకు ప్రజాసమస్యలు పట్టడం లేదని.. భాజపా ముందు ఆ మూడు పార్టీలూ సాగిలపడ్డాయని విమర్శించారు. సమస్యలపై అడుగడుగునా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని శైలాజానాథ్ స్పష్టం చేశారు.

44 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon