• Neti Charithra

ఛీ..ఛీ.. అనిపిస్తున్న 'కోడెల' వ్యవహారం!ఛీ..ఛీ.. అనిపిస్తున్న 'కోడెల' వ్యవహారం!

అమరావతి:నేటి చరిత్ర : ఏపీ అసెంబ్లీ మొదటి స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల శివప్రసాద్ తీరు రాజకీయాల్లో ఛీ.. ఛీ.. అనిపిస్తోందనే వాదన అన్ని పార్టీలలో కనిపిస్తోంది. ఎపి అసెంబ్లీ కి వరదలు వచ్చి మునిగిపోతున్న సందర్భం ఎదురుకాలేదు. పోనీ ఏ అగ్నిప్రమాదం వచ్చింది లేదు. సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉండే అసెంబ్లీలో దొంగల భయం ఉండదు. గోడలకు బింగించే ఎసిలను కూడా పట్టుకుపోవడానికి ఎలాంటి సాకులు అయినా వెతకడం కష్టమే. అయినా కానీ ఆయన స్పీకర్ కార్యాలయ అత్యంత విలువైన ఫర్నిచర్ ను మూడు లారీల్లో తరలించేశారు. ఈ వ్యవహారం కొత్త ప్రభుత్వం వచ్చాక తెలిసి ఇటీవల పోలీసుల విచారణకు సైతం ఆదేశించింది జగన్ సర్కార్. మాయమైన ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ పట్టుకుపోయారని తెలిసి అంతా అవాక్కయ్యారు. ఇదంతా వైసిపి కుట్రే అనుకున్నాయి టిడిపి వర్గాలు. అయితే నిజం తెలిశాక పసుపు దండు షాక్ కి గురైంది. ఔరా అని ఆక్స్చర్య పోవడంతో బాటు ఈ వ్యవహారం పై కోడెల శివప్రసాద్ వివరణ కోసం ఎదురు చూసింది. అవును నిజం …. నిజమే అసెంబ్లీ ఫర్నిచర్ నా దగ్గరే వుంది. అధికారులు వస్తే ఇచ్చేస్తా. లేదా ఆ ఫర్నిచర్ విలువ కడితే డబ్బు చెల్లించేస్తా. భద్రత లేకపోవడంతోనే వాటిని నేనే పట్టుకు వచ్చేశా. ఇందులో తప్పేముంది అంటూ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఎపి రాజకీయాలల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీనిపై మంత్రి కన్నబాబు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదే పని సామాన్యులు చేస్తే దొంగతనం అంటారా ? దోపిడీ అంటారా ? చేతివాటం అంటారా ? అంటూ ప్రశ్నల వర్షమే కురిపించారు. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ విమర్శల వర్షం తుఫాన్ లా వచ్చి పడింది. అయితే టిడిపి శిబిరం లో కలకలం రేగింది. దీనిపై వ్యాఖ్యలు చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. కోడెల శివప్రసాద్ కు మద్దతు పలికేందుకు సైతం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో కోడెల కుమారుడు, కుమార్తె కె ట్యాక్స్ పేరిట దందా చేశారని ఆరోపిస్తూ అనేక కేసులు నమోదు అయిపోయాయి. తాజాగా ఈ వివాదం ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేసింది. ఈ ఫర్నిచర్ తరలింపు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

26 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon