• Neti Charithra

చిరంజీవి, రాంచరణ్ కుటుంబాలకు తప్పిన ప్రమాదం !


చిరంజీవి, రాంచరణ్ కుటుంబాలకు తప్పిన ప్రమాదం !



హైదరాబాద్: నేటి చరిత్ర


కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు ఆదివారం ఓ ప్రమాదం నుంచి బయట పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా లోని

కామారెడ్డి జిల్లా దోమకొండలో

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో అపశృతి చోటుచేసుకుంది. పార్థివదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగలు

ఒక్కసారిగా రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అంత్యక్రియలకు హాజరైన సినీనటుడు చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌, ఉపాసన తదితరులు ఇబ్బంది పడ్డారు. అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ

సిబ్బంది మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్, ఉపాసనతో పాటు బంధువులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.కొద్దిసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు కొనసాగాయి.



395 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon