• Neti Charithra

చిరు ఉద్యోగి ఇంట్లో.. ట్రంకు పెట్టెల లో బంగారు.. నగదు కట్టలు..పట్టు పడ్డాయి..!


చిరు ఉద్యోగి ఇంట్లో.. ట్రంకు పెట్టెల లో బంగారు.. నగదు కట్టలు..పట్టు పడ్డాయి..!



కదిరి: నేటి చరిత్ర



అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్సీ కాలనీలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ ఇంట్లో ట్రంకు పెట్టెలోభారీగా బంగారం, వెండి పట్టు బడటం సంచలనంగా మారింది.

డీఎస్పీ రాఘవరెడ్డి నేతృత్వంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ మొత్తాన్ని

స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో ఆయుధాలు, బంగారం, వెండి నిల్వలు ఉంచారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. మనోజ్‌ ఇంట్లో ఉన్న 8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో పెట్టెను తెరిచి వాటిని లెక్కిస్తున్నారు.

ఇవన్నీ ట్రెజరీలో పని చేసే మనోజ్‌కు చెందిన వస్తువులుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కనీస రక్షణ లేకుండా ఓ షెడ్డులో భారీ మొత్తం లో బంగారు, నగదు కట్టలు నిల్వవుంచడం వెనుక అసలు మూలాలు గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు.



471 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon