• Neti Charithra

చిన్నారి వర్షిత ..హత్య కేసును ఛేదించిన ఏపీ పోలీసులు!

#చిన్నారి వర్షిత ..హత్య కేసును ఛేదించిన ఏపీ పోలీసులు!

మదనపల్లె: నేటి చరిత్ర (నవంబర్16) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన చిన్నారి వర్షిత హత్య కేసులో నిందితుని "ముసుగు"ను పోలీసులు తొలగించారు. చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడిన అసలైన నిందితుడిని ఛత్తీస్ ఘడ్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన అఘాయిత్యం బయట పడినట్లు తెలిసింది. వారం రోజులుగా పోలీస్ శాఖను ముప్పు తిప్పలు పెట్టిన కేసును స్థానిక పోలీసులు ఛేదించినట్లు సమాచారం.

నిందితుడు కురబలకోట మండలం మొలకవారిపల్లె వాసిగా గుర్తించినట్లు సమాచారం. ఇతన్ని జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుని ఆచూకీ కోసం..ఆరు పోలీస్ బృందాలు ఆంధ్రా-కర్ణాటక- తమిళనాడు- మహారాష్ట్ర- ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో రాత్రి, పగలు నిరంతర కృషితో నిండితుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.