• Neti Charithra

చిన్నారి వర్షిత హత్యపై .. కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్!

#చిన్నారి వర్షిత హత్యపై .. కీలక ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్!

అమరావతి: నేటి చరిత్ర (నవంబర్10) తెలుగు రాష్ట్రాల్లో కల కలం.. సృష్టించిన చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుట్టపాళ్యం కు చెందిన వర్షిత దారుణ హత్య కేసు పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. వర్షిణిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కిరాతకుడిని వెంటనే అరెస్ట్ చేసి, చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దుర్మార్గుడికి కఠినంగా శిక్ష పడేలా చూసేందుకు చర్యలు తీసుకుంటామనిఅన్నారు. కాగా, వర్షిత పోస్టుమార్టం రిపోర్టు ముదివేడు పోలీసు అధికారులకు అందింది. చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఆపై ఊపిరాడకుండా చేసి, చంపేశారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, వర్షిత కిడ్నాప్ నకు గురైన ప్రాంతంలోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది. అతను కర్ణాటకకు చెందిన వాడని చెబుతున్న అధికారులు, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగ ఏపీ మహిళా కమిషన్ చెర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన విషయం.. సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యం లో సీఎం చిత్తూరు జిల్లా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు ఇచ్చి నట్లు సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon