• Neti Charithra

చంద్రబాబు కు 16 యేళ్ళ జైలు తప్పదు- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి!

#చంద్రబాబు కు 16 యేళ్ళ జైలు తప్పదు- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి!

తిరుపతి: నేటి చరిత్ర (నవంబర్9) టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి పనులు వెలికి తీస్తే పదహారు ఏళ్లు జైలులో ఉంటారని వ్యాఖ్యానించారు. ఆయన్ని భగవంతుడే కాపాడాలన్నారు. సీఎం జగన్ అవినీతి పరుడు, పదహారు నెలలు జైల్లో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు మూడ్రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ‘మేము రౌడీయిజం చేసే వాళ్లం అయితే ప్రజలు గెలిపించే వాళ్లే’కాదన్నారు. జగన్ సీఎం అయ్యాక వర్షాలు సమృద్ధిగా కురిశాయని వెల్లడించారు. నదులన్నీ జీవనదులై పొంగిపొర్లుతున్నాయని చెప్పారు. ఇసుక తీయడం కష్టం అవుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎవరు చనిపోయినా ఇసుక వల్లే చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక పవన్‌కల్యాణ్ అయితే సొంత నిర్ణయాలు పక్కన పెట్టి 'చంద్రబాబు ' పలికే మాటలే.. తాను పలుకుతున్నాడని ధ్వజం మెత్తారు. రాష్ట్రము లో జగన్ పాలన జనరంజకం గా ఉందని ఏపీ పాలన ను ఇతర రాష్ట్రాల్లో ను అభినందిస్తున్నారన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon