• Neti Charithra

చంద్రబాబు ఇంటివద్ద బందోబస్తు చేసిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ .. పోలీసుల్లో కల కలం !


చంద్రబాబు ఇంటివద్ద బందోబస్తు చేసిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ .. పోలీసుల్లో కల కలం !



హైదరాబాదు: నేటి చరిత్ర


ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటివద్ద బందోబస్తు బాధ్యతలు చేపట్టిన ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ రావటం తో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. హైదరాబాద్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొని వచ్చిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్‌ కరోనా

బారినపడ్డారు. బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ మే 5న విధుల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి ఈ నెల 7న వచ్చారు. అనుమానిత లక్షణాలు ఉండగా మూడు రోజుల క్రితం పరీక్ష చేశారు. శనివారం వచ్చిన ఫలితాల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతనికి సోకినట్లు తెలిసింది. దింతో హైదరాబాదులో చంద్రబాబు నాయుడు

ఇంటి వద్దబాధ్యతలు చూస్తున్న పోలీసులు కు వైద్య పరీక్షలు చేయించేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

253 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon