• Neti Charithra

చిత్తూరు లో పేకాట కేంద్రం పై దాడులు.. పట్టు పడ్డ కడప జిల్లా వాసులు..8 ఖరీదైన కార్లు సీజ్!


చిత్తూరు లో పేకాట కేంద్రం పై దాడులు.. పట్టు పడ్డ కడప జిల్లా వాసులు..8 ఖరీదైన కార్లు సీజ్!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు నగరం లో భారీగా జరుగుతున్న

పేకాట స్థావరంపై పోలీసుల ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న

20 మందితో పాటు 8 కార్లు ,ద్విచక్ర వాహనాలు భారీ మొత్తంలో నగదు పట్టు పడింది. చిత్తూర్ నగర శివార్లలోని మురకంబట్టు సమీపంలో తాలూకా పోలీసులు రిజర్వ్ దళాల ఆపరేషన్ నిర్వహించారు. పేకాటలో పట్టుబడిన వారిలో కడప జిల్లా కు చెందిన కీలక వ్యక్తులు పట్టు పడగ వారిని వదిలి పెట్టాలని

పెద్దయెత్తున్న అధికారులకు వొత్తిళ్ళు వచ్చినట్లు సమాచారం.

పేకాట నిర్వహకుడు సుధాకర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


359 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon