• Neti Charithra

చిత్తూరు లో దాడులు చేసిన పోలీసులు.. 150 బస్తాల సబ్సిడీ బియ్యం సీజ్.. ఆరుగురు అరెస్ట్!


చిత్తూరు లో పోలీసుల దాడులు..150 బస్తాల సబ్సిడీ బియ్యం.. పట్టి వేత.. ఆరుగురు అరెస్ట్ !

చిత్తూరు జిల్లా సత్యవేడు మండల‌ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ‌రవాణా,అక్రమ‌ నిల్వలపై ఎస్సై నాగార్జున్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి‌దాడులు‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మాకు అందిన సమాఛారం మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విఆర్ కండ్రిగ చెక్ పోస్ట్ వద్ధ సత్యవేడు నుండి నగరికి రేషన్ బియ్యం అక్తమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకుని‌ విఛారించడం జరిగిందన్నారు.రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ పెద్దమనుషులుగా చలామణి అవుతున్న ప్రభాకర్ నాయుడు,సునీల్,బాబు,గణేష్,రవి ,దేవన్ అనే 6 మందిని అరెస్ట్ చేసి కేసునమోదు చేశామన్నారు.





రేషన్ బియ్యం అక్రమ‌నిల్వలు కల్గిన‌ గోదాముల్లో దాడులు చేసి 150బస్తాల రేషన్ బియ్యం,రెండు ద్విచక్రవాహనాలు,బియ్యం అక్రమంగా తరలించేందుకి‌ వినియోగించిన టాటా మ్యాజిక్ వాహనం ను స్వాధీనం చేసుకున్నామని,వాటి విలువ 3,90,000 ఉంటుందన్నారు.ఎవరైనా సరే చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సంధర్భంగా ఎస్సై నాగర్జున్ రెడ్డి హెచ్చరించారు.



14 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon