- Neti Charithra
చిత్తూరు జిల్లా 104,108 నోడల్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మదనపల్లె డిప్యూటీ డిఎంహెచ్ లోక్ వర్ధన్..!
చిత్తూరు జిల్లా 104,108 నోడల్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మదనపల్లె డిప్యూటీ డిఎంహెచ్ లోక్ వర్ధన్..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా 104 , 108 నోడల్ అధికారి మరియు డిస్ట్రిక్ట్ సర్వేలేన్స్ అధికారి గా డాక్టర్ లోకవర్ధన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. గత 16 నెలలుగా మదనపల్లె డివిజన్ డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ గా విధులు నిర్వహించారు.ఈసందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వేలేన్స్ ఆఫీసర్ మరియు 104, 108 సేవల జిల్లా నోడల్ అధికారి డాక్టర్
లోకవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్రిస్టాత్మకంగా ప్రారంభించిన 104 సంచార ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు శ్రమిస్తానని,108 సేవలు అందరికి అవసరమైన సమయాల్లో పొందేవిధంగా కృషి చేస్తానని,సమాజంలో అంటు వ్యాధులు నియంత్రణ లో సర్వేలెన్స్ ను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆరోగ్య సిబ్బంది ని అప్రమత్తం చేసి ఆరోగ్య సమాజ స్థాపనకు అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. ఇందుకొఱకు జిల్లా అధికారులు ,ఆరోగ్య కేంద్ర అధికారులు ,ఆరోగ్య సిబ్బంది సహకరించాలని కోరారు.