• Neti Charithra

చిత్తూరు జిల్లా లో రోడ్డు ప్రమాదం ... ఇద్దరు యువకులు మృతి !

చిత్తూరు జిల్లా లో రోడ్డు ప్రమాదం.... ఇద్దరు యువకులు మృతి !

బంగారుపాళ్యం: నేటి చరిత్ర (ఫిబ్రవరి11)

వోల్వో బస్సు-టూ వీలర్‌ను వెనుక నుండి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కెజి.సత్రం వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు... కెజి.సత్రం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుండి కరెంట్‌ లైన్‌ను లాగేందుకు పరికరాలు తీసుకొని మాపాక్షికి ఇద్దరు టూ వీలర్‌పై వెళుతుండగా.. బంగారుపాళ్యం మండలం కెజి.సత్రం వద్ద బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై టూ వీలర్‌ను వెనుక నుండి వోల్వో బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో టూ వీలర్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు బంగారుపాళ్యంకు చెందిన రాజేంద్ర, నలగాంపల్లికి చెందిన రాజేష్‌ లుగా గుర్తించారు. వీళ్లు కాంట్రాక్టర్‌ వద్ద కూలీలుగా పనిచేసేవారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

.

87 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon