• Neti Charithra

చిత్తూరు జిల్లా లో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు..శ్రీసిటి వద్ద నిరసనలు!

#చిత్తూరు జిల్లా లో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు..శ్రీసిటి వద్ద నిరసనలు!

శ్రీ సిటి: నటి చరిత్ర (అక్టోబర్5) చిత్తూరు జిల్లా శ్రీసిటీ పరిధిలో ప్రభుత్వ మద్యం షాపు వద్ద శనివారం మహిళలు బైఠాయించి నిరసన చేశారు. ఇక్కడ మద్యం షాపును రద్దు చేయాలని గత నెల రోజులుగా అక్కడి గ్రామ పెద్దలు, ఇటు ప్రభుత్వం అటు మంత్రి, ఎమ్మెల్యే ల వద్ద పలుమార్లు ఫిర్యాదు చేశారు. వారు కూడా మద్యం షాపు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 1 తేదీ నుంచి ప్రభుత్వ మద్యం షాపులు తెరిచిన విష‌యం తెలిసిందే. నాలుగు రోజులుగా ఆరూరులో షాపు మూత వేశారు. అయితే శనివారం మద్యం షాపు తెరవడంతో మహిళలు ఒక్కసారిగా షాపు వద్దకు వచ్చి అక్కడే కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు. షాపు తెలిస్తే సహించేది లేదని వారు అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు. శ్రీ సిటీ పరిధిలోని చెంగంబాకం గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు మహిళలు చేరి ఆయనకు గౌరవంగా శాలువా కప్పి తమ గ్రామంలో మద్యం షాపు రద్దు చేయాలని దండాలు పెట్టీ విన్నవించగ దీంతోఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి న ఆయన షాపును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరూరు గ్రామానికి చెందిన వివిధ పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon