• Neti Charithra

చిత్తూరు జిల్లా లో ప్రేమికుల జంట ఆత్మహత్య!

జంట ఆత్మహత్య కలకలం.. రేపింది.

పెద్దపంజాని మండలం ..పెనుగొలకల గ్రామానికి చెందిన అమర్నాథ్‌ అనే యువకుడికి మదనపల్లె రూరల్‌ గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే యువతితో వివాహమైంది. వృత్తిరీత్యా బెంగళూరులోని హోటల్‌ లో పనిచేస్తున్న అమర్నాథ్‌ కు త్రిపుర రాష్ట్రానికి చెందిన అంజలినాథ్‌ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలిసిన మొదటి భార్యతో కలహాలు చోటు చేసుకోవడంతో.. అమర్నాథ్‌, అంజలినాథ్‌ లు కలిసి పెనుగొలకల గ్రామంలోని ఓ పంట పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon