• Neti Charithra

చిత్తూరు జిల్లా లో నాటు సారా నిల్వల ఫై దాడులు... నిందితుల అరెస్ట్

#చిత్తూరు జిల్లా లో నాటు సారా నిల్వల ఫై దాడులు... నిందితుల అరెస్ట్

ఎర్రవారి పాళ్యం : నేటి చరిత్ర (సెప్టెంవర్13) చిత్తూరు జిల్లా యరావారిపాలెం మండలం బొడేవాండలపల్లిలో విక్ర‌యిస్తున్న 60 లీటర్లు సారాయి పట్టుబడింది. శుక్రవారం సాయంత్రం 4గం సమయంలో పీలేరు మండలం మర్రీమాకుల తాండాకు చెందిన‌ క్కర్నానాయాక్, హరినాయక్, అను ఇద్దరు వ్యక్తులు వారి పల్సర్ బైక్ పై 60 లీటర్లు నాటు సారాయి బొడేవాండళపల్లిలో అమ్ముతుండగా ఎస్సై లక్ష్మీనారాయణ వారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. 60 లీట‌ర్ల నాటు సారాయిని, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేశారు. ఈ దాడుల్లో ఎస్సై లక్ష్మీనారాయణతో పాటు హెడ్ కానిస్టేబుల్‌ ఆది, కానిస్టేబుల్‌ విజయ్, రాజెండ్ర, హోమ్ గార్డ్ చెంగలరాయులు పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon