• Neti Charithra

చిత్తూరు జిల్లా లో నాటుతుపాకుల కల కలం.. వందలాది తుపాకుల పట్టివేత !


చిత్తూరు జిల్లా లో నాటుతుపాకుల కల కలం.. వందలాది తుపాకుల పట్టివేత !

(కంభంవారి పల్లె లో పట్టు పడ్డ నాటు తుపాకులు)




(మదనపల్లె , తంబల్లపల్లి నియోజక వర్గాల్లో పట్టు పడ్డ తుపాకులు)



(పెద్ద పంజాని లో పట్టు పడ్డ తుపాకులు)


చిత్తూరు జిల్లా లో పలు చోట్ల నాటు తుపాకులు గతం లో ఎన్నడూ లేని విధంగా భారీగా పట్టు పడటం సంచలనం కలిగిస్తోంది. జిల్లా సరిహద్దు లలో పలుచోట్ల దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండగా అటవీ జంతువుల కోసం కొందరు నాటు తుపాకులతో వేట కొనసాగిస్తున్న

సమాచారం అందుకున్న జిల్లా అధికారులు మూకుమ్మడి దాడులకు ఆదేశించినట్లు సమాచారం.


విశ్వసనీయ సమాచారం మేరకు.. చిత్తూరు, కుప్పం, పలమనేరు, బంగారుపాల్యం మదనపల్లె , తంబల్లపల్లి, పీలేరు, పుంగనూరు పరిసరాల్లో పలు చోట్ల దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అటవీ జంతువుల వేటగాళ్ల రాక పోకలు పై పూర్తి సమాచారం అందుకున్న జిల్లా అధికారులు మూకుమ్మడి దాడులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు 600 తుపాకులు పట్టు పడ్డట్టు సమాచారం. ముఖ్యంగా ఒక్క బంగారు పాళ్యం పరిసరాల్లో 100 కుపైగా తుపాకులు పట్టు పడ్డాయి. మదనపల్లె , తంబల్లపల్లి నియోజక వర్గాల పరిధి లోని మదనపల్లె తాలుకా పరిధి లో 21 తుపాకులు, నిమ్మనపల్లె లో 6, బి కొత్తకోట లో 5, ముదివేడు లో 5, పిటిఎం లో 6,

ములకలచేరువు లో 6, పెద్ద మండ్యం లో 6, తంబల్లపల్లి లో 6, పిలేరునియోజకవర్గం కంభంవారి పల్లె లో 19 చొప్పున నాటు తుపాకులు పట్టు పడ్డాయి. తుపాకుల అక్రమ వినియోగాల పై మరి కొన్ని చోట్ల దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నాటు తుపాకులు పట్టు పడితే.. ఒక్కరు కూడా నిందితులు దొరకక పోవడం జిల్లా లో హాట్ టాపిక్ గా మారుతోంది.


405 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon