• Neti Charithra

చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ.. చేపట్టిన కాంగ్రెస్ నేతలు..!


చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ.. చేపట్టిన కాంగ్రెస్ నేతలు..!




పీలేరు: నేటి చరిత్ర


రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేసే వరకు పోరాటం నిలిపేది లేదని ఏపీసిసి సెక్రటరీ, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతల మోహన్ రావు తెలిపారు. గురువారం పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె ఎస్

ఆఘామోహిద్దీన్ ఆధ్వర్యంలో గడిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కోటి

సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీసీసీ సెక్రటరీ చింతల మోహన్ రావుకు కెఎస్ ఆఘా మొహియుద్దీన్ శాలువా కప్పి,పుష్ప గుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో చింతల మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు వ్యవసాయ సంక్షోభానికి రైతు వినాశనానికి దారి తీస్తాయని అన్నారు. ఈ బిల్లులు రైతులకు ప్రయోజనాలు చేకూర్చవని కేవలం ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికే ఉపయోగపడతాయని అన్నారు.ఈ

బిల్లులను రద్దు చేసేవరకు రైతులతో కలిసి కోటి సంతకాలను సేకరించి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తద్వారా బీజేపీ మెడలు వంచి బిల్లులు రద్దు చేయిస్తామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆఘామోహిద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేస్తుందని అన్నారు.పీలేరు మండల పార్టీ అధ్యక్షులు ఎస్ మహబూబ్ భాష మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా ఎల్లప్పుడూ రైతుల వెంటనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గోషాల దేవి, పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ మహబూబ్ భాష, మాజీ పీసీసీ సెక్రెటరీ శ్రీవర్ధన్ చౌదరి, రైల్వేకోడూరు మండలాధ్యక్షులు సినిమాల రమేష్, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు ఆర్. మల్లికార్జున, కలికిరి మండల మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ షఫి, పుల్లంపేట ఉపాధ్యక్షురాలు లోని, కార్యకర్తలు పఠాన్ ఆధమ్, షాజిద్, చంద్ర తదితర కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.



77 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon