• Neti Charithra

చిత్తూరు జిల్లా లో కరోనా వైద్య సేవలు భేష్- పబ్లిక్ హెల్త్ సెక్రెటరీ కమల్ రాజ్..!


చిత్తూరు జిల్లా లో కరోనా వైద్య

సేవలు భేష్- పబ్లిక్ హెల్త్ సెక్రెటరీ కమల్ రాజ్..!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో కరోనా పేషెంట్లను కాపాడేందుకు కో విత్ కేర్ సెంటర్లు,ట్రయాజ్ సెంటర్లు, బాగా ఉపయోగపడుతున్నాయని వీటి ద్వారా 86 శాతం మందిని కాపాడినట్లు తెలుస్తోందని రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ కమల్ రాజ్ అన్నారు. శనివారం సాయంత్రం

కలెక్టర్ చాంబర్ నుంచి వివిధ వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వ్యాధిని కనుక్కొని ఏ విధమైన చర్యలు చేపడుతున్నామని అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో 85 వేల మందికి చికిత్స ను ఏ విధంగా అందించారని అడిగారు. జిల్లా వైద్య శాఖ అధికారి పెంచలయ్య మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వాలంటీర్లు ఆశ వర్కర్లు ఇతర వైద్య సిబ్బంది వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి సమీపంలో ఉన్న

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 సంజీవిని వ్యాన్ ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని రోజుకు ఏడు వేల ఐదు వందలు వరకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి వ్యాధి ఉన్న వారిని తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్ లేదా గోవింద్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రికి పంపడం జరుగుతుంది అన్నారు. నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎక్కువ శాతం ఆర్ టి పి సి ఆర్ లు ఉంటున్నాయని రేపిడ్ టెస్టులు చాలా తక్కువగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500 మంది ఏఎన్ఎంలకు పల్స్ ఆక్సి మీటర్లను టెంపరేచర్ గన్ లను ఇవ్వడం జరిగిందని వాటి ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే

నిర్వహిస్తున్నారని ఇంటింటికి వాలంటీర్ల సహాయంతో నిర్వహిస్తున్న ఈ సర్వే ద్వారా పూర్తిస్థాయిలో వ్యాధిగ్రస్తులకు గుర్తించడం జరుగుతోందని అదేవిధంగా ఇతర వ్యాధులతో ఇబ్బంది పడేవారు నువ్వు సైతం గుర్తించి వారికి చికిత్స నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలు 5 కోవిద్ కేర్ సెంటర్లు ఉన్నాయని ఇందులో 40 మంది డాక్టర్లు 40 మంది నర్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రస్తుతం 1,355 మంది ఉన్నారని అదేవిధంగా హోమ్ ఐసోలేషన్ లో 1,355 మంది ఉన్నారని చెప్పారు. జిల్లాలో ఉన్న ఐసియు బెడ్ 117 మంది పాజిటివ్ కేసు గ్రస్తులు చికిత్స పొందుతున్నారని 687 మంది ఆక్సిజన్ బెడ్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. డాక్టర్ కమల్ రాజు మాట్లాడుతూ స్థాయిలో మరింత తినంగా పనిచేయాలని పట్టణాల్లో 55 శాతం గ్రామాల్లో 45 శాతం పాజిటివ్ కేసులు ఉన్నందున వారికి హోం ఐసోలేషన్ లో ఉన్నా చికిత్స అందించాలని త్వరితగతిన వారు ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు అదేవిధంగా రానున్న కాలంలో h1,y1, జీకా వంటి వైరస్ లు వచ్చే ప్రమాదముందని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మరణాలు లో కొంత శ్రద్ధ వహిస్తే మరణాల శాతాన్ని మరింత తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ డాక్టర్ సరళమ్మ, జిల్లా కంటి వెలుగు అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు ఆసుపత్రి కోవిద్ అధికారి డాక్టర్ మహేష్, మదనపల్లి జిల్లా ఆసుపత్రి సూపర్-ఇండెంట్ రామ్మూర్తి నాయక్, డి పి ఎం ఓ డాక్టర్ శ్రీనివాస్, కోవిద్ కంట్రోల్ రూమ్ ఇన్చార్జ్ డాక్టర్ ప్రసాద్, డీఎంవో డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ సుదర్శన్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


61 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon