• Neti Charithra

చిత్తూరుజిల్లా లో కరోనా వైద్య చికిత్సలో..పురోగతి- డిప్యూటీ సీఎం నారాయణ స్వామి !


చిత్తూరుజిల్లా లో కరోనా వైద్య చికిత్సలో..పురోగతి- డిప్యూటీ సీఎం నారాయణ స్వామి !



తిరుపతి: నేటి చరిత్ర


కరోనా వైద్య చికిత్సలు లో పురోగతి కనబడుతోందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. కలెక్టర్ భరత్ గుప్తతో

పాటు కోవిడ్ 2019 టాస్క్ ఫోర్స్ అధికారుల సమావేశం శనివారం తిరుపతి లో జరిగింది.

జిల్లాలో టమాటో రైతులు తమ పంటలను విక్రయించుకునేలా ఆయా మండలాల పరిధిలోనే వెసులుబాట్లు కల్పించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రైతులు పండించిన పంటను మార్కెట్‌కు తరలించలేకపోతున్నారన్నారు. కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా పంటల మార్కెటింగ్‌ కోసం ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జిల్లాలో కొవిడ్‌ కేసులను నియంత్రించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో సగానికి పైగా బాధితులు డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను వారి వారి రాష్ట్రాలకు పంపే విధంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు



142 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon