• Neti Charithra

చిత్తూరుజిల్లా లో ఏఎస్ఐ ఆత్మహత్య... పోలీస్ శాఖ లో కల కలం..!



చిత్తూరుజిల్లా లో ఏఎస్ఐ ఆత్మహత్య... పోలీస్ శాఖ లో కల కలం..!


కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ ఏ ఎస్ ఐ బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్ శాఖ లో కల కలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పం పోలీస్ స్టేషన్ లో

పనిచేస్తున్న ఏ ఎస్ ఐ రాజేందర్ (54) 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. పది రోజుల క్రితం ఆయనను చిత్తూరు టూ

టౌన్ కు అధికారులు బదిలీ చేశారు. రిలీవ్ కావాల్సి ఉండగా తమిళనాడు సరిహద్దు నడుమురు చెక్ పోస్ట్ లో వారం రోజులుగా ఆయన విధులు కు హాజరు అవుతున్నారు.

బుధవారం ఆయన విధులకు హాజరు

కావాల్సి ఉండగా సాయంత్రం వరకు ఆయన విధులకు హాజరు కాలేదు. ఈ నేపథ్యం లో ఆయన నివాసం ఉంటున్న కుప్పం గాండ్ల వీధి లోని ఇంటి వద్ద కు వెళ్లిన పోలీసులకు

అనుమానం వచ్చి తలుపులు తీయగా అప్పటికే వంట గదిలో ఏఎస్ ఐ రాజేంద్ర ఆత్మహత్య కు పాల్పడిన విషయం వెలుగు చూసింది. దింతో ఆయన ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే విషయం పై పోలీసులు విచారణ చేపట్టారు.

413 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon