• Neti Charithra

చిత్తూరుజిల్లా లో ఎత్తిపోతల పథకాలు ను ముట్టడించిన వామపక్షాలు !


చిత్తూరుజిల్లా లో ఎత్తిపోతల పథకాలు ను ముట్టడించిన వామపక్షాలు !



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లాలోని హంద్రీ-నీవా,గాలేరు-నగరి ప్రాజెక్టుకులను సత్వరమే పూర్తిచేసి జిల్లా ప్రజానీకానికి సాగు,త్రాగునీరు అందించాలనే డిమాండ్ మీద, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న "నిరసన

ప్రదర్శన"ల్లో భాగంగా,సిపిఐ తంబళ్లపల్లి నియోజవర్గ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బి.కొత్తకోట మండలంలోని గట్టు గ్రామం సమీపంలో ఉన్న తరిగోడు ఎత్తిపోతల పథకం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. "మండుటెండ"లో ఒక గంటపాటు

జరిగిన ఈ కార్యక్రమాన్నుద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఎల్. నర్సింహులు, సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్. మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ; హంద్రీ-నీవాకు రాష్ట్ర ప్రభుత్వం 40 టీఎంసీ ల నీరు అందించనందున నేడు నియోజకవర్గ ప్రజలు,రైతులు త్రాగు, సాగునీరు అందక తీవ్ర క్షామంతో సతమతమౌతున్నారని,120 రోజులు కృష్ణా నీటిని వదలాల్సిన చోట 40 రోజులు మాత్రం ట్రైల్ రన్ పైన తూతూమంత్రంగా నీటిని వదిలారని, ఇందువల్ల నియోజవర్గంలో చెరువులకు నీరు నింపడం జరగలేదని వాపోయారు.ఆనాడే సిపిఐ పార్టీ తరపున ప్రభుత్వానికి అనేకసార్లు నిరసనలు తెలిపి సక్రమంగా

నీరు వదలాలని పోరాటాలు చేసినా, ప్రభుత్వం, అధికారులు పెడచెవిన పెట్టారని ఆవేదన చెందారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల మిగులు జలాలకు ప్రభుత్వం పనులు చేపడితే, తెలంగాణ ప్రభుత్వం వివాదం రేపి నందువల్ల కోర్టు ఆదేశంతో అదికూడా నిలిచిపోయిందని అన్నారు. కృష్ణా జలాలను ప్రథమ ప్రాధాన్యతగా రాయలసీమకే కేటాయించాలని బచావత్ కమీషన్, శ్రీభాగ్ తీర్మానం తెలుపుతున్నా, నేడు మనం చాలా అన్యాయానికి

గురౌతున్నామన్నారు. వర్షాలు తగుస్తాయిలో కురిసినప్పుడు ప్రాజెక్టుల సామర్థ్యం తగు స్థాయిలలో లేనందువల్ల నదీజలాలు సముద్రం పాలవుతున్నా కూడా స్పందించని కొందరు కుహనా రాజకీయ నాయకులు రాయలసీమకు నీరు ఇవ్వాలంటే మాత్రం అడ్డు పడుతుండటం చాలా అన్యాయం అన్నారు. ప్రయోజనం లేని అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన హంద్రీ-నీవాకు పూర్తి సామర్థ్యంతో నీరు అందించాలని,గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని,చెరకు,మామిడి,టమోటా రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు బి.వేణుగోపాల్ రెడ్డి,యం.అష్రఫ్ అల్లి,యస్.సలీం భాష,యస్. తంబయ్య శెట్టి,ఏఐటీయూసీ నాయకులు మురళి, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కె.అంజనప్ప, ఎండపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

115 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon