• Neti Charithra

చిత్తూరుజిల్లా లో అటవీశాఖ అధికారులు తీరును నిరసిస్తూ.. రైతుల ఆందోళన..!


చిత్తూరుజిల్లా లో అటవీశాఖ అధికారులు తీరును నిరసిస్తూ.. రైతుల ఆందోళన..!



పలమనేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పలమనేరు లో ఏనుగు ల బాధితులు శనివారం నిరసనకు దిగారు.

శుక్రవారం రాత్రి ఏనుగుల దాడిలో సుమారు 15 లక్షల విలువ చేసే పంట నష్టం జరిగింది.

తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని తక్షణం పరిహారం అందజేయాలని

ఎఫ్ఆర్వో కార్యాలయం వద్ద రైతుల ధర్నా చేసి నినాదాలు చేశారు.ప్రతిరోజూ ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి

మండలంలోని పెంగరగుంట గ్రామ సమీపంలోని వివిధ పంట పొలాలపై దాడులు చేసిన ఏనుగులు చేతికొచ్చిన వారి పంటను తొక్కి నాశనం చేసాయి.

దీంతో ఆగ్రహం చెందిన రైతులు సుమారు 20 మంది దాకా పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారఎంతసేపైనా అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆగ్రహం చెందిన

రైతులు అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు. సుమారు 20 మంది రైతులు పంట నష్టపోయి తమ గోడు వినిపించేందుకు వస్తే అధికారులు కనీసం గది నుండి బయటకు వచ్చి సమస్య తెలుసుకునే బాధ్యత కూడా లేదా అంటూ అధికారులను నిలదీశారు.

దీంతో అధికారులు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.


73 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon