• Neti Charithra

చిత్తూరు జిల్లా పిటిఎం సరిహద్దు లో బోరు లారీ బోల్తా.. ముగ్గురు మృతి !


చిత్తూరు జిల్లా పిటిఎం సరిహద్దు లో బోరు లారీ బోల్తా.. ముగ్గురు మృతి !


(బోరు లారీ బోల్తా తో మృతి చెందిన యువకులు)



(బోరు లారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకులు )



పిటిఎం : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా సరిహద్దు లో మంగళవారం అర్ధరాత్రి బోర్ లారీ బోల్తా పడ్డం తో ముగ్గురు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దు పిటిఎం మండలం చెన్నారాయుని పల్లె సమీపం కర్ణాటక కు చెందిన పాల చెరువు వద్ద ఓ రైతుకు బోరు డ్రిల్లింగ్ కు వెళుతున్న బోరు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో వాహనం లో ప్రయాణిస్తున్న

ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం తో అతన్ని బెంగుళూరు కు తరలించారు. మృతి చెందిన వారు తమిళనాడు కు చెందిన వ్యక్తులు గా గుర్తించారు.ఈ ప్రమాదం లో మరో ఐదుగురు యివకులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చేలూరుపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


1,703 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon