• Neti Charithra

చిత్తూరు జిల్లా అభివృద్ధిలో.. ప్రథమ.. స్థానం తంబల్లపల్లి దే!



చిత్తూరు జిల్లా అభివృద్ధిలో.. ప్రథమ.. స్థానం తంబల్లపల్లి దే!




తంబల్లపల్లి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో జరిగిన అభివృద్ధి , సంక్షేమ పథకాలు అమలు లో తంబల్లపల్లి నియోజకవర్గానికి ప్రథమ స్తానం దక్కింది. 2020-21 ఆర్థిక సంవత్సరం లో ముఖ్యంగా జాతీయ ఉపాధిహామీ పథకం పనులు,గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,వైయస్ఆర్ విలేజ్ క్లినిక్,2020-21 ఆర్థిక సంవత్సరంలో అమలు ప్రణాళిక,ప్రభుత్వ పురోగతులపై ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేసింది.వీటిలో తంబల్లపల్లి నియోజకవర్గం అన్ని విభాగాల్లో పురోగతి సాధించి మొదటి స్థానంలో నిలువగా...కుప్పం నియోజకవర్గం మాత్రం అభివృద్ధి లో చివరి స్తానం లో నిలిచింది.

అభివృద్ధి, సంక్షేమం లో ప్రథమ స్థానం లభించటం తో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి కృషిని ఆరు మండలాల వైసీపీ నేతలు, స్థానికులు అభినందిస్తున్నారు.

ప్రభుత్వం జిల్లా లోని నియోజకవర్గాలలో ఇచ్చిన ర్యాంకులు ఇలా ఉన్నాయి.

1. తంబల్లపల్లి

2. పుంగనూరు

3. సత్యవేడు

4. గంగాధర నెల్లూరు

5. మదనపల్లె

6. చిత్తూరు

7. నగరి

8. పీలేరు

9. శ్రీకాళహస్తి

10. పలమనేరు

11. తిరుపతి

12.పూతలపట్టు

13. చంద్రగిరి

14.కుప్పం

667 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon