• Neti Charithra

ఘనంగా మదర్ థెరిస్సా జయంతి.. భారీ ఎత్తున రక్తదానం చేసిన యువకులు

#ఘనంగా మదర్ థెరిస్సా జయంతి.. భారీ ఎత్తున రక్తదానం చేసిన యువకులు

మదనపల్లె:నేటి చరిత్ర (ఆగస్టు26) చిత్తూరుజిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాతృమూర్తి మదర్ థెరిస్సా 109వ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో యువతీ,యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నినాదం ప్రతి ఒక్కరిలో ఉండాలని, పేదలకు,అనాధలకు మరణశయ్యపై ఉన్నటువంటి ఎంతోమంది అభాగ్యులకు సేవలు అందించినటువంటి మదర్ థెరిస్సా మనసు గొప్పదని , మహోన్నత వ్యక్తులు స్వర్గస్తులైన వారి అడుగుజాడలను పాటించడం ఎంతో ఆనందంగా ఉందని, తమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని. ఆమె జయంతి సందర్భంగా రక్తదాన ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసినటువంటి యువతి,యువకులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున పండ్లు పలహారాలు అందించారు.కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు వెంకటేశ్వర్ రెడ్డి,సునీల్,దేవా,ప్రకాష్,దినకర్ పద్మ,సంధ్య,భాను ప్రకాష్ మరియు రక్తనిధి సిబ్బంది మహేష్,స్వరూప,నాగులమ్మ,శ్రీరాములు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.