• Neti Charithra

గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..

#గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి..

అమరావతి: నేటి చరిత్ర (సెప్టెంబర్19) ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించారు. 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1, 26, 728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 21.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు. అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు • ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40% • వెనుక బడిన తరగతులకు చెఇన్దిన వారికి 35% • ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు 30% హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో 1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు • ఓపెన్ కేటగిరిలో 24583 • బి. సి. కేటగిరిలో 100494 • ఎస్ .సి కేటగిరిలో 63629 • ఎస్. టి .కేటగిరిలో 9458 • వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు జరిగిన 14 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు • ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు • ఎస్.సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు • ఎస్.టి. కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు మహిళా అభ్యర్దులల్లో గరిష్టంగా 112.5 మార్కులు పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము/ఆర్ టి జి.ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చునని అధికారులు తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon