• Neti Charithra

గ్రామీణ ప్రజల కోసమే..104 సేవలు- డాక్టర్ చక్రవర్తి..!


గ్రామీణ ప్రజల కోసమే..104 సేవలు- డాక్టర్ చక్రవర్తి..!



చౌడేపల్లి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని దుర్గాసముద్రం గ్రామంలో 104 డాక్టర్. కె. చక్రవర్తి కరోనా విస్తరిస్తున్న కారణంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ సామజిక దూరం పాటించాలని అలాగే దగ్గు, జలుబు, జ్వరం

ఉన్నవారు వెంటనే కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. మన ఇంట్లోనే ఆవిరి పట్టడం లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కరోనా నుండి కోలుకోవచ్చని డా. చక్రవర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 104 ఆపరేషన్ ఎక్సుక్యూటివ్ మదన్, పైలట్ కృష్ణమూర్తి, Deo నవ్యకాంత్, నౌషాద్,సామజిక కార్యకర్త గంగాధర, ఏయన్ఎం సునీత, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వాలంటీర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో 104 డా. కె. చక్రవర్తి మాట్లాడుతూ 104 వాహనం ద్వారా గ్రామ ప్రజలకు ఉచితంగా డాక్టర్ సలహా తో వైద్యం,9రకాల రక్త పరీక్షలు నిర్వహించి, ఆ పేటెంట్స్ కి సరిపడే మందులను అందిస్తామని తెలిపారు. గతంలో 56 రకాలు మందులను అందిస్తుండగా ఇప్పుడు 74 రకాల మందులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ 104 వాహనంలో బీపీ, షుగర్, థైరాయిడ్, నొప్పులు, జ్వరం, గర్భవతులకు, బాలింతలకు ప్రతేకంగా

ECG వంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని, 26 అత్యాధునిక పరికరాలు అయినా ఈసీజీ, ఆప్తాల్మిక్ స్కోప్, అంబు బ్యాగ్, లారింగో స్కోప్, ఓటోస్కోప్,వంటి పరికరాలతో 104 వాహనంలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు.


64 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon