• Neti Charithra

గ్యాస్ సిలిండర్ పేలి... రెండు ఆవులు మృతి

#గ్యాస్ సిలిండర్ పేలి... రెండు ఆవులు మృతి

విజయనగరం : నేటి చరిత్ర (ఆగస్టు26) విజయనగరం జిల్లా లో గ్యాస్‌ సిలిండర్ పేలడంతో ఇల్లు దగ్ధమై రెండు ఆవులు మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాడంగి మండలం వాడడా గ్రామంలో నివాసముంటున్న గొర్రెల సూర్య నారాయణ ఇంట్లో ఆదివారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో గ్యాస్‌ పేలింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంటిని ఆనుకొని ఉన్న పాకలో ఒక ఎద్దు మరణించగా, ఒక ఆవు సగం కాలిపోయింది. ధాన్యం కూడా పూర్తిగా కాలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండచ్చు అని స్థానికులు చెబుతున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్‌ ఇంజన్‌ వచ్చేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధమైందని తెలిపారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon