• Neti Charithra

గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాల పై చంద్ర బాబు ఫైర్!

#గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాల పై చంద్ర బాబు ఫైర్!

గుంటూరు : నేటి చరిత్ర (అక్టోబర్2) మహాత్మాగాంధీ-లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి లను పురస్కరించుకొని.. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు మహాత్మాగాంధీ-లాల్‌ బహదూర్‌ శాస్త్రి ల చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. గాంధీ ఆశయాలకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గాంధీ జయంతి రోజు ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? అని ప్రశ్నించారు. పోలీసుల్ని పెట్టి మరీ మద్యం అమ్మిస్తూ... గాంధీ జయంతికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని అడిగారు. ఎవరి విశ్లేషణకూ అర్ధం కాని విధంగా జగన్‌ వ్యవహారశైలి ఉందని విమర్శించారు. ఈ రాష్ట్రం జగన్‌ జాగీరు కాదని, బ్రిటీషు వారైనా చట్టాన్ని అనుసరించారు కాని ఈ ముఖ్యమంత్రి కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదని దుయ్యబట్టారు. చట్టాన్ని చుట్టం గా చేసుకుని ప్రజలకు శిక్షగా మారుస్తున్నారన్నారు. చిన్నాన్న ని ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ? అని మరోసారి ప్రశ్నించారు. పేదలకు అన్నంపెట్టే అన్నా కాంటీన్ల ను మూసేశారని, ఇసుక కొరత వల్ల లక్షలాది మంది రోడ్డున పడ్డారని, 2003 లో తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తే... ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సీబీఐ చీవాట్లు పెట్టిన వ్యక్తి నీతిమంతుడిగా చలామణి అవుతున్నారని, రాష్ట్ర ప్రజలంతా అవినీతిపరులు తానొక్కడే నీతిమంతుడిని అన్నట్లు జగన్‌ ఉన్నాడని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని మహాత్ముడి స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని నినాదమిచ్చారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon