• Neti Charithra

గోదావరి నది లోకి దూకిన.. ప్రేమ జంట !

#గోదావరి నది లోకి దూకిన.. ప్రేమ జంట !

తూర్పు గోదావ‌రి : నేటి చరిత్ర (డిసెంబర్12) తూర్పు గోదావ‌రి జిల్లా లో ఇద్దరు ప్రేమికులు నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన యాలంగి రమేష్ (25), మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన చిక్కారు దుర్గా ప్రశాంతి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ల ప్రేమ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌క పోవ‌డంతో ఈనెల 9తేదీన ఇంటినుంచి పారిపోయారు. అనంత‌రం ఇవాళ‌ యానాం..ఎదురులంక గోదావరిలో శవమై కనిపించారు. ఈమేర‌కు ఐ.పోలవరం పోలీసులు మృతదేహాలను రాజోలుకు చెందిన వారుగా గుర్తించి, మలికిపురం పోలీసులకు అప్పగించారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon