• Neti Charithra

గూడ్స్ రైలు లో పేలిన .. ఆయిల్ ట్యాంక్.. ఏపీ లో భారీ ప్రమాదం.. కోటి కి పైగా నష్టం !


గూడ్స్ రైలు లో పేలిన .. ఆయిల్ ట్యాంక్.. ఏపీ లో భారీ ప్రమాదం.. కోటి కి పైగా నష్టం !


( ప్రకాశం జిల్లా లో గూడ్స్ రైలు ప్రమాద దృశ్యాలు)




ప్రకాశం: నేటి చరిత్ర


ప్రకాశం జిల్లా లో గూడ్స్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదం లో భారీ మంటల కారణంగా కోటి నష్టం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. ఉన్నాయి.

ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం వద్ద అర్ధరాత్రి విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్‌ రైలు నాయుడు పాలెం- బాపూజీ నగర్‌ మధ్య వంతెన దాటుతుండగా చివరన ఉన్న డీజిల్‌ బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి.

ట్రాక్‌ కుంగిపోవడంతో పట్టాలు తప్పి బోగీలు వంతెనపై నుంచి కిందపడ్డాయి. ఈ

ప్రమాదంలో డీజిల్‌ బోగీలు దగ్ధమవడంతోపాటు, రైల్వే ట్రాక్‌ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. సుమారు కోటి కి పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


131 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon