• Neti Charithra

గుంటూరు..ఘటనలు పై తీవ్రంగా స్పందించిన పీలేరు ముస్లిం..మత పెద్దలు..!


గుంటూరు..ఘటనలు పై తీవ్రంగా స్పందించిన పీలేరు ముస్లిం..మత

పెద్దలు..!



పీలేరు: నేటి చరిత్ర


(పీలేరు మీడియా సమావేశం లో మాట్లాడుతున్న ముస్లిం నేతలు)


గుంటూరు నగరం లో భావోద్వేగంతో

పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడి ఘటనకు రాజకీయ రంగు వేయవద్దని చిత్తూరు జిల్లా పీలేరు జమాయత్ మరియు జాక్ నాయకులు కోరారు. శనివారం పీలేరు జమాత్ మరియు జాక్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ

2018 వ సంవత్సరం మే నెల 5వ తేదీన గుంటూరు జిల్లా లో మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనకు గాను భావోద్వేగానికి లోనై కొంతమంది యువకులు గుంటూరు పోలీసు స్టేషన్ పై దాడి చేసిన సంఘటనను గురించి కోర్టు కేసును ప్రభుత్వము విత్ డ్రా చేసినట్లుగా జిఓ నెంబర్ 776/20 ప్రకారం ఆగస్టు 12వ తేదీన విడుదల చేసింది. సదరు కోర్టు కేసు వాపస్ తీసుకుంటున్నట్లు సదరు జీవోలో ప్రభుత్వం ఒక సామాజిక వర్గాన్ని

పేర్కొన్నందున కోర్టు స్టేటస్ కో విధించింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమైనప్పటికీ ఇది రాష్ట్ర యువకుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని విపక్షాలు మరియు రాజకీయ పార్టీలు రాజకీయ ఉద్దేశంతో కాకుండా మన రాష్ట్ర యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీనిని అందరూ రాజకీయాలకతీతంగా పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వవలసినదిగా మరియు రాష్ట్రప్రభుత్వం కూడా దీనిపై కోర్టు లో కౌంటర్ అఫిడవిట్ వేయవలసినదిగా పీలేరు జమాత్ మరియు జాక్ తరపున కోరుతున్నట్లుగా పై సంఘ నాయకులు కోరారు.కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మునీర్, ఖాజీ నవాజుద్దీన్, తమీమ్ , ముస్తఫా,బోదేషా,మౌలా, మున్నా,అమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.


210 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon