• Neti Charithra

గంజాయి తరలిస్తున్న లారీ పట్టివేత ! !

#గంజాయి తరలిస్తున్న లారీ పట్టివేత !

పశ్చిమ గోదావరి : నేటి చరిత్ర (అక్టోబర్3) పశ్చిమ గోదావరి జిల్లా లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 400 కేజీల గంజాయిని కొయ్యలగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం కొయ్యలగూడెంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి హర్యానాలోని ఫరీదాబాద్‌ కు 15 బస్తాలలో నింపిన 400 కేజీల గంజాయిని లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. కొయ్యలగూడెం పోలీసులు గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌ లో సుమారు 80 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని లారీని సీజ్‌ చేశారు. పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరికొంతమంది స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon