• Neti Charithra

కేసీఅర్ రసం.. లేని పండు లాంటి పదవి ఇస్తానంటున్నాడు - మాజీ హోం మంత్రి నాయుని

#కేసీఅర్ రసం.. లేని పండు లాంటి పదవి ఇస్తానంటున్నాడు - మాజీ హోం మంత్రి నాయుని

హైదరాబాద్‌: నేటి చరిత్ర మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి రసం లేని పండు లాంటి ఆర్టీసీ చెర్మన్ పదవి ఇస్తానంటూ మాట తప్పారని నాయిని ఆరోపించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజునే నాయిని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో నాయిని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నాను. కానీ కేసీఆర్‌, వద్దు కౌన్సిల్‌లో ఉండు మంత్రి పదవి ఇస్తా అన్నాడని తెలిపారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి పదవి ఇస్తానన్న కేసీఆర్‌.. ఇప్పుడేమో ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తానంటున్నారని నాయిని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు చైర్మన్‌ పదవి వద్దని.. అందులో రసం లేదంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon