• Neti Charithra

కృష్ణానది లో గేదెల లారీ బోల్తా

#కృష్ణానది లో గేదెల లారీ బోల్తా

గుంటూరు : నేటి చరిత్ర (ఆగస్టు24) గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం వద్ద బల్లకట్టుపై ఆవలి ఒడ్డు రామన్నపేట నుండి గేదెలు లోడుతో వెళ్తున్న‌ లారీ పుట్లగూడెం వైపు బల్లకట్టు మీదనుండి దిగి గట్టుపైకి ఎక్కే క్రమంలో కృష్ణా నదిలోకి జారి ప‌డ‌టంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. గతంలో చందర్లపాడు మండలం గుడి మెట్ల వద్ద మునిగిన బల్లకట్టు ...గతంలో జరిగిన ఘటనలో బల్లకట్టు పై ఒక లారీ ఒక ఆటో మునిగిన పరిస్థితి ..బ‌ల్ల‌క‌ట్టు వద్ద సరైన సదుపాయాలు లేకుండా బల్లకట్టును నడిపిస్తున్న పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉప్పొంగిన కృష్ణానది ఒకపక్క మరొక పక్క అరకొరగా సదుపాయాలతో బల్లకట్టు వద్ద కారణంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం కారణంగా ఇటువంటి సంఘటన జరుగుతున్నాయని ఆందోళనలో ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు జరగకుండా అటు గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా అధికారులు బల్లకట్టు ప్రయాణిస్తున్న ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి అపాయం జరుగకుండా ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులు పర్యవేక్షణ ఎప్పుడూ కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon