• Neti Charithra

క్వారెంటె న్ కేంద్రం లో కాటేసిన పాము.. బాలిక మృతి !


క్వారెంటె న్ కేంద్రం లో కాటేసిన పాము.. బాలిక మృతి !






నేటి చరిత్ర :( ప్రత్యేక ప్రతినిథి)


కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన ఓ క్వారంటైన్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుతో ఓ ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం

చోటుచేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో సోమవారం (మే 25న) ఈ ఘటన జరిగింది.స్వస్థలాలకు వస్తున్న వలస కూలీలతో పాటు వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ కేంద్రంలో

ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఆరేళ్ల బాలిక సహా ఓ కుటుంబాన్ని నైనిటాల్ జిల్లాలోని తల్లిసేథి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆరేళ్ల బాలిక నోటి నుంచి నురగలు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు బెతల్ ఘాట్ కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తీసుకొచ్చారు. బాలిక శరీరంపై

గాట్లు గుర్తించిన వైద్య సిబ్బంది విష సర్పం కాటేసిందని భావించి ఆ చిన్నారికి విషపు విరుగుడు ఇంజెక్షన్లు చేశారు. కానీ కొంత సమయానికే బాలిక చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. ఈ ఘటనపై నైనిటాల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందగా.. విచారణకు ఆదేశించారు. బాలిక కుటుంబానికి రూ.3 లక్షల మేర పరిహారం చెల్లించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

278 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon