• Neti Charithra

కోవిద్ ఆసుపత్రి నుంచి నలుగురు ఖైదీలు.. పరార్.. పోలీసు శాఖలో కల కలం..!


కోవిద్ ఆసుపత్రి నుంచి నలుగురు ఖైదీలు.. పరార్.. పోలీసు శాఖలో కల కలం..!




హైదరాబాద్‌: నేటి చరిత్ర


గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారు అయిన ఘటన సంచలనంగా మారింది.

చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో చికిత్స కోసం వారిని సికింద్రాబాద్‌ గాంధీ

ఆసుపత్రికి తరలించారు. వీరు చికిత్స పొందుతూ గురువారంతెల్లవారు జామున నలుగురు ఖైదీలు ఆసుపత్రి నుంచి తప్పించుకున్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులోని బాత్రూమ్‌ గ్రిల్స్‌  తొలగించి పరారయ్యారు. వార్డు బయట పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ

బాత్రూమ్‌ నుంచి పారిపోయారు. ఖైదీలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో 10 మంది ఖైదీలు చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు ఖైదీలు పరారయ్యారని చర్లపల్లి జైలు అధికారులు పేర్కొన్నారు.



231 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon