• Neti Charithra

కూలిన విమానం.. 9 మంది మృతి!

#కూలిన విమానం.. 9 మంది మృతి!

వాషింగ్ట‌న్ : నేటి చరిత్ర (డిసెంబర్1) అమెరికాలో పిలాట‌స్ పిసి-12 ర‌కానికి చెందిన విమానం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మృతి చెందిన‌ట్లు అక్కడి ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మృతుల్లో పైల‌ట్ స‌హా ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం సమ‌యంలో మొత్తం 12 మంది విమానంలో ఉన్నారు. వెంట‌నే రంగంలోకి దిగిన నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డ్ బృందం క్ష‌త‌గాత్రుల్ని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ద‌క్షిణ డకోటాలోని చెంబ‌లీన్ అనే ప్రాంతంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణమ‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon