• Neti Charithra

కీలక దశకు చేరుకున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసు.. అధికారులకు పోలీస్ 'బాస్' దశా.. నిర్దేశం !

#కీలక దశకు చేరుకున్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసు.. అధికారులకు పోలీస్ 'బాస్' దశా.. నిర్దేశం !

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ను పోలీస్ బాస్ డిజిపి గౌతమ్ సవాంగ్ స్వయంగా విచారణ కు పూనుకోవటం అటు పోలీస్ శాఖ లోను ఇటు రాజకీయ వర్గాల్లోనూ కల కలం రేపుతోంది. ఇప్పటి కే ఈ కేసును ఛేదించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం.. విచారణ మందగించటం... 1300 మందిని ఈ కేసు లో విచారణలు చేపట్టడం వంటి ఘటనలు.. జరిగినా కేసు విచారణ కొలిక్కి రాకపోవటం వంటి కారణాలు అధికార పార్టీకి సైతం ఇబ్బంది కరంగా మారింది. ఈ నేపత్యం లో హత్య కేసులో కీలక అనుమణితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో పాటు ఆటను రాసిన సూసైడ్ నోట్ కూడా సంచలనంగా మారింది. తాజాగా ఈకేసు లో ప్రభుత్వం ఎవరిని రక్షించే ప్రయత్నం చేస్తోంది అంటూ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గట్టి గా ప్రశ్నించడం రాజకీయ దుమారం లేపింది. ఈ కేసు అటు ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మకంగా మారటం తో ఈ హత్య కేసులో అసలు మూలలను ఛేదించేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా నే డిజిపి గౌతమ్ సవాంగ్ నేరుగా పులివెందుల పర్యటన చేసినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా ఆయన వివేకానంద రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించగా సిట్ అధికారులతో ఆయన నేరుగా ఈ కేసు పురోగతి ని సమీక్షించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక సమాచారాన్ని డిజిపి అందుకున్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఈ కేసు చిక్కుముడిని విప్పేందుకు పోలీస్ బాస్ సిట్ అధికారులకు దశా.. నిర్దేశం చేసినట్లు సమాచారం.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon