• Neti Charithra

కార్మికుల కు అండగా ఎన్నో.. చట్టాలు- న్యాయ మూర్తి రవింద్ర బాబు!

చిత్తూరు: నేటి చరిత్ర (డిసెంబర్30)

చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో అసంఘటిత కార్మికుల న్యాయసేవల పథకం-2015పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్‌ భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌, కార్మికశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలునాయక్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు మాట్లాడుతూ కర్మాగారాల్లో పనిచేసేవారిని కార్మికులని, వ్యవసాయ రంగం, భవన నిర్మాణ, చేతివృత్తులు, దుకాణాలు, ఇళ్లలో పనిచేసేవారు అసంఘటిత కార్మికులన్నారు. కార్మికులకు ఉండే సౌకర్యాలు.. అసంఘటిత కార్మికులకు ఉండవన్నారు.

వీరి ప్రయోజనార్థం పలు చట్టాలు ఉన్నాయ న్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా చట్టాలు, పథకాల గురించి తెలియజేసేందుకే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సత్వరమే అసంఘటిత కార్మికులు అందరూ కార్మికశాఖ వద్ద తమపేర్లు నమోదుచేసుకోవాలన్నారు.

15 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon