• Neti Charithra

కార్పెంటర్ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం.. చేయాలి- కుమారా చారి


కార్పెంటర్ కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం.. చేయాలి- కుమారా చారి


పీలేరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం మోడల్ కాలనీ లోని శ్రీ ఎల్లమ్మ తల్లి వుడ్ వర్క్స్ ఆవరణలో ఆంద్రప్రదేశ్ కార్పెంటర్స్(వడ్రంగి) అసోసియేషన్, పీలేరు మండల శాఖ ఆధ్వర్యములో సమావేశం జరిగినది.


పై సమావేశమునకు ముఖ్య అతిధిగా పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎస్.కుమారాచారి మాట్లాడుతూ గత రెండు నెలలు లాక్డౌన్ కారణంగా పనులు లేక కార్పెంటర్లు పస్తులున్నారని లాక్డౌన్ ఎత్తివేసినా కూడా కరోనా విజృంభిస్తున్న కారణంగా పనులు లేవని

ప్రభుత్వం మగ్గమునేసే చేనేత కార్మికులకు 24వేలు ఆర్థిక చేసిందని కానీ మగ్గము తయారు చేసే కార్పెంటర్లను విస్మరించడం బాధాకరమన్నాడు.


అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కే. చంద్రశేఖరాచారి మాట్లాడుతూ

ముఖ్యమంత్రి గారు ఆటో కార్మికులకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఆర్థిక సహాయం చేశారని కార్పెంటర్లకు కూడా పదివేలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని లేని పక్షంలో కార్పెంటర్ల ఆకలి చావులు తప్పవని అన్నాడు.


పై కార్యక్రమములో అసోసియేషన్ మండల కార్యదర్శి పీ.కృష్ణమాచారి, మండల కోశాధికారి కే.ఆనందాచారి,

కమిటీ సభ్యులు వీ.రాజేష్, ఎం.నాగరాజాచారి, బాబు ఆచారి మండలంలోని కార్పెంటర్లు పాల్గొన్నారు.

96 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon