• Neti Charithra

కుప్పం విలేఖరుల .. కు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప.. బంపర్ ఆఫర్ !


కుప్పం విలేఖరుల .. కు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప.. బంపర్ ఆఫర్ !



కుప్పం: నేటి చరిత్ర


రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కుప్పం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు చిత్తూరు ఎంపీ నిధులతో పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఎంపీ రెడ్డప్ప తెలిపారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంగళవారం సి ఎల్ ఆర్ సి భవనంలో కుప్పం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటాచలం ఆధ్వర్యంలో జర్నలిస్టులు

ఎంపీ రెడ్డప్ప ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జర్నలిస్టులకు హౌసింగ్ అదేవిధంగా కుప్పంలో లో ప్రైస్ క్లబ్ భవన నిర్మాణానికి సంబంధించి విషయాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా

స్పందిస్తూ కుప్పం నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఎంపీ నిధులతో పక్కా గృహాలు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే

రూ. 10 లక్షలు కేటాయించడం జరిగిందని, భావన నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలంటూ స్థానిక అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ సంబంధిత మండల తాసిల్దార్ లను ఆదేశించారు.

182 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon