• Neti Charithra

కుప్పం లో వంద మంది పోలీసుల తో తనిఖీలు.. పదుల సంఖ్యలో వాహనాలు స్వాధీనం!

#కుప్పం లో వంద మంది పోలీసుల తో తనిఖీలు.. పదుల సంఖ్యలో వాహనాలు స్వాధీనం!

కుప్పం: నేటి చరిత్ర (సెప్టెంబర్25) చిత్తూరు కుప్పంలోని శ్రీలంక కాలనీ,మోడల్ కాలనీలలో బుధవారం ఉదయం4గంటల సమయం లోపోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇటీవల కుప్పం పరిసరాల్లో దొంగ నోట్ల తయారీ తోపాటు పలు కీలక నేరాలకు సంబంధించిన నేరస్తులు ఇక్కడ ఆశ్రయం పొందుతు న్నట్లు అనుమానంతో పోలీసులు దాడులు చేశారు. ముఖ్యంగా కుప్పంలోని రెండు శ్రీలంక కాలనీ ,మోడల్ కాలనీలలో వందమంది పోలీసులతో పలమనేరు డిఎస్పీ ఆధ్వర్యంలో తనికీలు చేశారు‌. కాలనీలో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డులు తీసుకుని వీరు తమిళనాడు, కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల నుండివచ్చారా అని పరిశీలించారు.ప్రతి ఇంటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు రికార్డులు లేకపోవడంతో ఆ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పలువురు అనుమాని తులను పోలీసులు అడుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon