• Neti Charithra

కుప్పంలో.. టీడీపీ- వైసీపీ ఘర్షణ.. అధికారు ల్లో టెన్షన్.. టెన్షన్ !

కుప్పం లో .. టీడీపీ- వైసీపీ ఘర్షణ... అధికారు ల లో టెన్షన్.. టెన్షన్ !

కుప్పం : నేటి చరిత్ర (ఫిబ్రవరి23)

చిత్తూరు జిల్లా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సోమవారం వెందుగంపల్లిలో టీడీపీ జెండాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. అయితే టీడీపీ జెండా దిమ్మెను తొలగించాలని వైసీపీ నేతల ఆందోళన చేస్తున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరించారు.

రెండు పార్టీలకు చెందిన నేతలు బాహాబహి కి దిగటం తో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉంటే.. సోమవారం, మంగళవారంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులను బ్యానర్లు తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క బ్యానర్ కూడా తొలగించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

120 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon