• Neti Charithra

కుప్పం.. టౌన్ బ్యాంక్ లో రూ.1.91కోట్లు స్వాహా.. ఐదుగురు ఉద్యోగుల పై కేసు నమోదు !


కుప్పం.. టౌన్ బ్యాంక్ లో రూ.1.91కోట్లు స్వాహా.. ఐదుగురు ఉద్యోగుల పై కేసు నమోదు !


కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా

కుప్పం కో- అపరేటివ్ టౌన్ బ్యాంక్ స్కాంలో ఐదు మంది ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం డిఎస్పీ అరిఫుల్ల కథనం మేరకు..

కుప్పం కో అపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఇటీవల రూ.1.91 కోట్ల మేరకు స్కాం జరిగిందంటూ బ్యాంక్ ఇంచార్జి మేనేజర్ వేదవతి ఫిర్యాదు మేరకు 379, 406, 409, 468, 471, 477A, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ స్కామ్ లో 10 రకాల మోసాలు జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.


కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి ఫిక్సిడ్ డిపాజిట్లపైన లోన్లు లో కొందరు

నకిలీ బాండ్లు, గిల్ట్ నగలు, ఉద్యోగుల బంధువుల పేరుతో లోన్లు, చనిపోయిన వారి పేరుమీద హౌస్ మార్ట్ గేజ్ లోన్లు, బంగారు తక్కువ తూకం ఉన్నా అధిక మొత్తంలో డబ్బులు చెల్లింపు తదితర మోసాలకు ఉద్యోగులు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో జరిగిన స్కామ్ పై పూర్తి స్థాయి

విచారణకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు నుఏర్పాటు చేసినట్లు డిఎస్పీ అరిఫుల్లా పేర్కొన్నారు.






69 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon