• Neti Charithra

కుప్పం అటవీశాఖ లో అవినీతి కంపు.. నలుగురు అధికారులు పై వేటు వేసిన ప్రభుత్వం !


(ప్రభుత్వం సస్పెండ్ చేసిన బీట్ అధికారి మున్నా)



(ఎఫ్ ఆర్వో కాలప్ప నాయుడు)



కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం పరిధి లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ పలు అటవీశాఖ అధికారులు ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామకుప్పం మండలం చిల్లిమనుగుంట అటవీ శాఖ పరిధి లో కుంట తవ్వకాలు,



( పాత పనులకు బిల్లులు చేసుకున్న ప్రాంతం )

సింగమాను కుంట వద్ద నీరు- చెట్టు పనులు లో అక్రమాలుమరియు అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలు పెంపకానికి అవసరం అయిన అల్లానేరేడు, కానగ, చింత, మర్రి తదితర రకాల విత్తనాలు కొను గోలు లో మొత్తం రూ.35 లక్షల నిధులు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం నలుగురి పై వేటు


(అటవీ శాఖ అనుమతి లేకుండా నిర్మించిన రోడ్డు)

వేసింది. వీటికి తోడు గుడుపల్లె నుంచి బెటారాయ స్వామి ఆలయ రహదారిలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మించారని వీటికి సహకరించిన సిబ్బంది పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగ ఆరోపణలు ఎదుర్కొంటున్న కుప్పం ఎఫ్ ఆర్వో కాలప్ప



నాయుడు, పలమనేరుసెక్షన్ అధికారి మధుసూదన్,నడుమురు బిట్ అధికారులు పరమేష్, మున్నా లను ప్రభుత్వం సస్పెండ్ చేయడం అటవీ శాఖ లో కల కలం రేపుతోంది.



166 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon