• Neti Charithra

కానిస్టేబుల్.. ఇంటి పై దాడులు.. భారీగా మద్యం నిల్వలు పట్టివేత !


కానిస్టేబుల్.. ఇంటి పై దాడులు.. భారీగా మద్యం నిల్వలు పట్టివేత !





కడప: నేటి చరిత్ర



అతను నిత్యం పహారా కాయాల్సిన పోలీస్.

. అక్రమ దందా ను అడ్ఫుకోవాల్సిన బాధ్యత అతనిది . అయితే అక్రమ సంపాదన కు అలవాటు పడ్డా డేమో.. తెలియదు కాని

అతడు ఇంట్లోనే అక్రమ మద్యం నిల్వ ఉంచి అదే పోలీసులకు చిక్కి.. సస్పెండ్ అయిన ఘటన కడప లో చోటు చేసుకుంది.జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీనారాయణ ఇంట్లో భారీ స్థాయిలో మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.

లక్ష్మీనారాయణ ఇంట్లో పెద్ద సంఖ్యలో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

కొంత కాలం గా ఇంట్లో నిల్వ ఉంచి కొందరు వ్యక్తులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.కాగా, లక్ష్మీనారాయణ ఇంట్లో మద్యం బాటిళ్లు లభ్యమవడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.


406 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon